కేసీఆర్‌ను నమ్మించేందుకే హరీశ్‌ యత్నాలు: రేవంత్‌

Revanth Reddy Fires On KTR And KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తనను తాను టీఆర్‌ఎస్‌కు విధేయుడిగా చిత్రీకరించుకునేందుకు మంత్రి హరీశ్‌రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, కానీ హరీశ్‌రావు జాతకం మొత్తం తెలిసిన కేసీఆర్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనను నమ్మడని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంగ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ‘కారు డ్రైవర్‌’ను మార్చొద్దని ఓ వైపు కేటీఆర్‌ విజ్ఞప్తి చేస్తుంటే.. హరీశ్‌ మాత్రం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నేత నర్సారెడ్డితో హరీశ్‌రావు గత నెల 25న రహస్య చర్చలు జరిపారన్నారు. ఈ చర్చల మరుసటిరోజు నర్సారెడ్డి ఢిల్లీ వచ్చి కాంగ్రెస్‌లో చేరారన్నారు. దీనిపై ప్రజలకు హరీశ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గురువారం రేవంత్‌ ఢిల్లీలో మాట్లాడుతూ.. గత నెల 25న నాటి హరీశ్‌రావు అధికారిక నివాసం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top