మోదీతో సరితూగే నేత లేరు..

Rajnath Says Opposition Has No Leader Like PM Modi   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో సరితూగే సత్తా ఉన్న నేత విపక్షంలో ఎవరూ లేరని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. మోదీని తిరిగి అధికారంలోకి రాకుండా చూడటమే విపక్షాల ఏకైక అజెండా అని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆదివారం రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మహాకూటమి ఏర్పాటుకు విపక్షాలు విఫల యత్నం చేస్తున్నాయని విమర్శించాయి. వారికి ఎలాంటి ప్రణాళిక లేదని, దేశ పురోభివృద్ధికి ఓ అజెండా లేదని, బీజేపీ ఓటమే లక్ష్యంగా చేతులు కలపాలని యోచిస్తున్నాయని ఆరోపించారు.

ప్రధాని మోదీ చేపడుతున్న మంచి పనులను నిలువరించడమే కాంగ్రెస్‌ ధ్యేయంగా ముందుకెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి బీజేపీ పలు రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ 20 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. మూడు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్‌ అసహనంతో బీజేపీపై విరుచుకుపడుతోందని విమర్శిఃచారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top