రాజ్యాంగ దినోత్సవంపై నిర్లక్ష్యమా: పొంగులేటి | ponguleti about kcr | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ దినోత్సవంపై నిర్లక్ష్యమా: పొంగులేటి

Nov 27 2017 3:03 AM | Updated on Sep 17 2018 8:11 PM

ponguleti about kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన విషయమని మండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్స వం జరపాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిజ్ఞ చేశాయని గుర్తుచేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని తెలంగాణలో అధికారికంగా ఎందుకు జరపలేకపోయిందో సీఎం కేసీఆర్‌ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తరఫున రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను స్మరించే కార్యక్రమాలు చేపట్టినట్టుగా ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement