లోకేష్ మన నెత్తిన ఎక్కేవారా?: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Speech In West Godavari Against TDP - Sakshi

సాక్షి, నరసాపురం: కులాల మధ్య చిచ్చు పెట్టే వాడిని కాదని... తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బీసీలకు, కాపులకు అన్యాయం చేసింది టీడీపీనే అని చంద్రబాబు నాయుడిని విమర్శించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి నరసాపురంలో ఆయన ప్రసంగిస్తూ.. ఈ జిల్లాకి  ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో టీడీపీ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే టీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టింది. కానీ జిల్లాకి టీడీపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

అరవై ఏళ్ళ క్రితం పూర్తి కావాల్సిన వశిష్ట వారధికి ఈ రోజుకీ  దిక్కులేదని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో కాపు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అన్నీ అవినీతిమయంగా తయారయ్యాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుభవం పశ్చిమగోదావరికి ఏమాత్రం పనికి రాలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమలో 15 సీట్లు గెలవకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారా.. లోకేష్ మంత్రై మన నెత్తిన ఎక్కేవారా అని ప్రశ్నించారు. మహిళా అధికారుల మీద దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగ సమస్యే ఉందని అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top