
మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌కు తమ ఓట్లతోనే బుద్ధి చెబుతామని పద్మశాలీలు హెచ్చరించారు.
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ తమకు ద్రోహం చేసిందని పద్మశాలీలు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ సీటును తమకు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఆంద్రప్రదేశ్ పద్మశాలీ సంఘం ఆదివారం అత్యవసరంగా సమావేశమైంది.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కేఏఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ... 13 జిల్లాల్లో సీట్ల కేటాయింపులో తమకు టీడీపీ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. తమతో పల్లకీలు మోయించికుని మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీని భుజాన వేసుకుని మోస్తే ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌కు తమ ఓట్లతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ సంఘంలోని సభ్యులందరితో చర్చించి తీర్మానాలు ప్రకటిస్తామని చెప్పారు.