ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌

Nominations in Online With Suvidha App - Sakshi

సాక్షి, యాదాద్రి :కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్‌లను ఆన్‌లైన్‌లో స్వీకరించే ప్రక్రియను ప్రవేశపెట్టింది. సువిధ యాప్‌ ద్వారా నామినేషన్‌ ఫారం 2ఏ పూర్తి చేసి దరఖాస్తు చేయొచ్చు. అలాగే నామినేషన్‌ వేసే అభ్యర్థి అఫిడవిట్‌ను పీడీఎఫ్‌ కాపీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలి. అయితే నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభమయ్యే ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్ధేశించిన సమయం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను ఆన్‌లైన్‌ సిస్టమ్‌ తీసుకుంటుంది. అలాగే సెలవు రోజులైన 21, 23, 24 రోజుల్లో నామినేషన్లను స్వీకరించదు. ఈఆర్‌ఓ, ఏఆర్‌ఓతోపాటు కంప్యూటర్‌ కేంద్రాల నుంచి కూడా నామినేషన్‌ అప్‌లోడ్‌ చేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అభ్యర్థులకు కల్పిస్తోంది. నామినేషన్‌ వేయడానికి జనరల్‌ అభ్యర్థి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చలాన్‌ను యాప్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top