ఎన్డీఏ సీట్ల సర్దుబాటు ఖరారు! | NDA Finalises Seat Sharing Formula For Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో సీట్ల సర్దుబాటు ఖరారు చేసిన ఎన్డీఏ

Aug 30 2018 1:38 PM | Updated on Aug 30 2018 1:41 PM

NDA Finalises Seat Sharing Formula For Bihar - Sakshi

బిహార్‌లో 20 ఎంపీ సీట్ల నుంచి బరిలో దిగనున్న బీజేపీ..

పట్నా : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల సర్ధుబాటును ఖరారు చేశాయి. బీజేపీ 20 స్ధానాల నుంచి పోటీ చేయనుండగా, జేడీ(యూ) 12 సీట్ల నుంచి, లోక్‌ జనశక్తి పార్టీ ఐదు సీట్ల నుంచి బరిలో దిగుతాయని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏ కూటమి నుంచి రాష్ర్టీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) పోటీ చేస్తే ఆ పార్టీకి బిహార్‌లో రెండు సీట్లు కేటాయించేలా అంగీకారం కుదిరినట్టు తెలిసింది.

2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ పార్టీ కృషిచేస్తుందని కేంద్ర మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్‌పీ చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహ పేర్కొన్నారు.కాగా బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా యూపీ, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఒక్కో సీటును జేడీ(యూ)కు ఇవ్వనున్నట్టు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement