‘ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయి’ | Nandini Awards also already given | Sakshi
Sakshi News home page

‘ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయి’

Feb 6 2018 4:43 PM | Updated on Mar 23 2019 9:10 PM

Nandini Awards also already given - Sakshi

ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌

తూర్పుగోదావరి జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ ఎంపీలపై ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు వేసే నాటకాలకు అవార్డులు ఇద్దామంటే నంది అవార్డులు కూడా అయిపోయాయని ఎద్దేవా చేశారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలంటే టీడీపీ ఎంపీలకు, మంత్రులకు భయమన్నారు. ఆస్కార్‌ అవార్డులు ఇద్దామంటే నాటకాలకు ఆస్కార్ అవార్డులు ఇవ్వరని అపహాస్యమాడారు.

చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో అధికారుల ముందు కాదని, ధైర్యం ఉంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ముందు చేయాలని సూచించారు. ధైర్యం కావాలంటే ఓ సారి గదిలోకి వెళ్లి ఎన్టీఆర్ చిత్ర పటం చూడాలన్నారు. చంద్రబాబు నాయుడికి దిక్కుమాలిన సలహదారులు దొరికారని వ్యాఖ్యానించారు

Advertisement
 
Advertisement
Advertisement