‘లోకేష్‌ కూడా లేఖ రాయడం హాస్యాస్పదం’ | MVS Nagi Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ కూడా లేఖ రాయడం హాస్యాస్పదం’

Apr 28 2020 5:21 PM | Updated on Apr 28 2020 5:32 PM

MVS Nagi Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్నారని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు పంటలకు మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్‌ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏనాడు తన కెబినెట్‌లో వ్యవసాయం గురించి చర్చించలేదని ఆరోపించారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1100 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం పాలనలో 14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు.  2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement