‘పార్టీకి ప్రియాంకే దిక్సూచీ’ | MP Minister Verma Says Priyanka Gandhi Ideal Candidate For Congress Chief | Sakshi
Sakshi News home page

‘పార్టీకి ప్రియాంకే దిక్సూచీ’

Jul 8 2019 6:05 PM | Updated on Jul 8 2019 6:06 PM

MP Minister Verma Says Priyanka Gandhi Ideal Candidate For Congress Chief    - Sakshi

పార్టీ చీఫ్‌గా ప్రియాంకే మేలు..

భోపాల్‌ : కాంగ్రెస్‌ చీఫ్‌గా ప్రియాంక గాంధీయే సరైన ఎంపిక అని మధ్యప్రదేశ్‌ ప్రజా పనుల శాఖ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్‌గా వైదొలిగిన నేపథ్యంలో పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం​గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం పోరాట పటిమ కలిగిన ప్రియాంక గాంధీ వంటి మెరుగైన నేత అవసరమని వర్మ పేర్కొన్నారు.

బీజేపీని దీటుగా ఎదుర్కొని పార్టీని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడవేసే సామర్థ్యం​ఆమెకు ఉందని అన్నారు. తమ కుటుంబం నుంచి పార్టీ నాయకత్వాన్ని ఎవరూ స్వీకరించాలని రాహుల్‌ కోరుకోవడం లేదనే వార్తలను ప్రస్తావిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా కాంగ్రెస్‌ను ఊహించలేమని అన్నారు. రాహుల్‌ పార్టీకి సలహాదారుగా ఉండి, గతంలో జరిగిన పొరపాట్లను చక్కదిద్దే పాత్రను పోషించాలని వర్మ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement