యూపీలో తగ్గనున్న కమలం ప్రాభవం

More Than Half Of UP Seats May Go To BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార బీజేపీకి సీట్లు తగ్గిపోనున్నాయి. గత ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లు కోల్పోనున్నట్లు ఆయా సంస్ధలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. యూపీలో బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయడానికి అఖిలేష్‌ యాదవ్‌ - మాయావతి కూటమి పనిచేసినట్టు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఎస్పీ - బీఎస్పీలు కలిసి పోటీ చేసినప్పటికీ ఆ పార్టీలు ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రావని తెలుస్తోంది. భారీ స్థానాలు కోల్పోతున్నప్పటికీ అధికార బీజేపీ యూపీలోని మొత్తం 80 స్థానాల్లో సగానికి పైగా గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 

ఏడు వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల మేరకు యూపీలో బీజేపీకి 45 స్ధానాలు, మహాకూటమికి 32 స్ధానాలు దక్కుతాయని తేలింది. రిపబ్లిక్‌ జన్‌ కీ బాత్‌ యూపీలో బీజేపీ గరిష్టంగా 57 సీట్లు దక్కించుకుంటుందని వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 స్ధానాలకు గాను బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి 80 స్ధానాలు కైవసం చేసుకుంది. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక గాంధీ తాజా ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్‌గా బరిలో దింపినప్నాపటికీ కాంగ్రెస్‌కు యూపీలో ఆశించిన ఫలితాలు సాధించడం లేదని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top