అందుకే చాపచుట్టి కృష్ణాలో పడేశారు : మంత్రి మోపిదేవి

Mopidevi Venkataramana Slams Chandrababu Over Palnadu Issue - Sakshi

సాక్షి, అమరావతి : ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు దొంగ దీక్ష, కొంగ జపాలను ప్రజలు నమ్మరని అన్నారు. పచ్చ నేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాప చుట్టి కృష్ణా నదిలో పడేసారని  చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చ నేతలు బెదిరించి కూర్చో బెడుతున్నారని ఎద్దేవా చేశారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిన సిగ్గు మాలిన రాజకీయం చంద్రబాబుదని అన్నారు. అచ్చెన్నాయుడు అహంభావంతో పోలీస్ అధికారులను దూషించారని మండిపడ్డారు.
(చదవండి : బాబు నివాసం వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్‌)

‘అచ్చెన్నాయుడు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. పోలీసు అధికారులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఉరుకునేది లేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కోడెల, యరపతినేని కుటుంబాల చేతిలో పల్నాడు నలిగిపోయింది. చంద్రబాబు అప్పుడేం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఒక్క రాజకీయ దాడి ఘటన కూడా చోటుచేసుకోలేదు. కృష్ణకు భారీగా నీళ్లొచ్చాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయి. అంతా ప్రశాంతంగా ఉన్నారు’ అని మంత్రి అన్నారు.
(చదవండి : రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top