కుల రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటు  | Mopidevi Venkataramana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

కుల రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటు 

Jun 15 2020 4:11 AM | Updated on Jun 15 2020 7:23 AM

Mopidevi Venkataramana Fires On Chandrababu - Sakshi

రేపల్లె: అడ్డగోలు దోపిడీతో దొరికిపోయిన టీడీపీ నేతల అరెస్ట్‌లతో చంద్రబాబు కుల రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణారావు విమర్శించారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో రూ.కోట్లు దోపిడీ చేసినట్టు సాక్ష్యాధారాలతో నిరూపణ అయిందని తెలిపారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేస్తే బీసీ కార్డును బయటకు తీయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఆయన ఆదివారం రేపల్లెలో మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..
 
► జేసీ ట్రావెల్స్‌పై అధికార యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటే.. కక్ష సాధింపు అంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్న తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు.  
► బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని గతంలో సీఎం అయిన చంద్రబాబు.. ఏనాడూ వారికి న్యాయం చేసింది లేదు. బీసీ వర్గాలకు ఆదరణ పేరుతో నాసిరకం పరికరాలను అందించి అక్రమ మార్గంలో కోట్లు దండుకున్నారు.  
► సీఎం జగన్‌ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్న తీరుచూసి ఓర్వలేక విమర్శించడం విపక్ష నేతలు మానుకోవాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement