టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌ రెడ్డి | MLC Damodar Reddy Joins TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌ రెడ్డి

Jun 9 2018 7:29 PM | Updated on Mar 18 2019 9:02 PM

MLC Damodar Reddy Joins TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీలో చేరారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దామోదర్‌ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.
 
నాగర్‌కర్నూల్‌లో దామోదర్‌ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేశారు కూడా. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి నాగం చేరికపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయినా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు.

తన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదని, తన మాటకు విలువలేదనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement