బాబువి దొంగ దీక్షలు, కొంగ జపాలు: మల్లాది

MLA Malladi Vishnu Distributes Ramzan Tofa At Vijayawada Central - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఏవిధంగా చేయూతనివ్వాలో తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే మాల్లాది విష్ణు పేర్కొన్నాడు. జిల్లాలో సెంట్రల్‌ నియోజకవర్గం సింగ్‌ నగర్‌ షాదీఖానాలోని 650 మంది ముస్లింలకు గురువారం ఆయన రంజాన్‌ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ముస్లిలం మైనార్టీలకను దేశంలో ఎవరూ చేయని రీతిలో వెన్నుదన్నుగా నిలిచారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిది అన్నారు. ఇక ఉపముఖ్యమంత్రి పదవిని మైనారిటీలకను ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కింది అని వ్యాఖ్యానించారు. మానవియ కోణంలో సీఎం జగన్‌ పాస్టర్లకు, మౌజమ్‌లకు బ్రాహ్మణులకు రూ. 5 వేల నగదు అందించారని తెలిపారు. (‘టీడీపీ కంటే మాది వందరెట్లు మెరుగైన పాలన’)

కరెంటు చార్జీలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి దొంగ దీక్ష చేస్తున్నాడని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన దొంగ దీక్షలు చేశాడని ఎమ్మెల్యే విమర్శించారు. ఢిల్లీలో, బాబ్లీలో చివరకు నగరంలోని మున్సిపల్‌ స్టేడియింలో కూడా దొంగ దీక్షలు చేశారని ఎద్దేవా చేశారు. కరెంటు బిల్లులు పెంచకున్నా ప్రభుత్వంపై బురద జల్లాలని దీక్షల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ముస్లిం మైనార్టీలు, దళితులను బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు వెన్నుదన్నుగా వైఎస్‌ జగన్‌ నిలిచారన్నారు. డాక్టర్‌ విషయంలో టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వదిలిపెట్టి వెళ్లిన బాకీలు రూ. 100 కోట్లు ఉంటే ఈనెల 22 నుంచి 30 తేదీలోపు రూ. 500 కోట్లు జమ చేస్తున్నామన్నారు. మే 30వ తేదీన పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం ముగించుకున్న సందర్భంగా ప్రతి డివిజన్‌ పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్నామని చెప్పారు. ఇక చంద్రబాబు దీక్షలు ఇంట్లో చేసినా హైదరాబాద్‌లో చేసినా అవి దొంగ దీక్షలు కొంగా జపాలు అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. (టీడీపీ నేతల దీక్షలు వృధా: జేసీ దివాకర్‌రెడ్డి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top