పవర్‌బోట్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్‌ | Minister KTR Travels on Power Boat | Sakshi
Sakshi News home page

Jul 7 2018 4:19 PM | Updated on Aug 30 2019 8:24 PM

Minister KTR Travels on Power Boat - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పట్టణంలోని మినీట్యాంక్‌ ను సందర్శించిన ఆయన.. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి పవర్ బోట్లో ప్రయాణించారు. అంతకుముందు ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటి పరిధిలో రూ. 60 కోట్లుతో చేపట్టిన అబివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు. రూ. 30 కోట్లతో పట్టణంలోని 41 వార్డుల్లో చేపట్టనున్న 215 పనులకు కూడా కేటీఆర్‌ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. పట్టణంలోని దివిటిపల్లి వద్ద చేపట్టనున్న ఐటీ పార్క్  పైలాన్ ఆయన ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement