స్ధానిక ఎన్నికలు: 29 వార్డులు ఎంఐఎం కైవసం | mim won 29 seats in up local polls | Sakshi
Sakshi News home page

యూపీ స్ధానిక ఎన్నికలు: 29 వార్డులు ఎంఐఎం కైవసం

Dec 1 2017 8:14 PM | Updated on Dec 1 2017 8:29 PM

mim won 29 seats in up local polls - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: యూపీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం 78 వార్డులకు పోటీ చేసి 29 వార్డుల్లో గెలుపొందింది. ఫిరోజాబాద్‌లో 11 సీట్లను, మహుల్‌ అజంగర్‌లో 11 సీట్లను ఎంఐఎం గెలుచుకుంది. సంభల్‌, అమ్రోహ,మీరట,భాగ్పట్‌లలో రెండేసి సీట్లను, ఘజియాబాద్‌, కాన్పూర్‌,బిజ్నోర్‌,అలహాబాద్‌,సీతాపూర్‌ కార్పొరేషన్లలో ఒక్కో స్ధానాన్ని దక్కించుకుంది.

ఫిరోజాబాద్‌ మేయర్‌ స్ధానానికి జరిగిన పోరులో తమ పార్టీ రెం‍డో స్ధానంలో నిలిచిందని, తమ మేయర్‌ అభ్యర్థికి 56,536 ఓట్లు పోలయ్యాయని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. బీజేపీ మేయర్‌ అభ్యర్థి నూతన్‌ రాథోర్‌ దాదాపు లక్ష ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలుపొందారు. యూపీ స్థానిక ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన ప్రజలకు ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement