అడగాల్సింది మమ్మల్ని కాదు సీఎంను.. 

Mallu Ravi Comments About Jalayagnam Projects - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: జలయజ్ఞంలో భాగంగా కృష్ణా నదిపై ప్రారంభమైన ప్రాజెక్టుల్లో ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేని టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. మంత్రులు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం మానుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాజెక్టులపై నిలదీయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు కేవలం సీఎం దగ్గర పరపతి కోసమే కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని, చేతగానితనంతోనే తమను విమర్శిస్తున్నారని రవి మండిపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top