మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు

Maharashtra Portfolio Allocations Ajit Pawar Get Finance - Sakshi

అజిత్‌కు ఆర్థిక శాఖ..

ఎన్సీపీకే కీలక శాఖలు

సాక్షి, ముంబై : మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సూచన మేరకు ఆయన ప్రతిపాదించిన మంత్రుల శాఖల జాబితాను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదివారం ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ముందుగా ఊహించిన విధంగానే ఎన్సీపీ సీనియర్‌ నేత ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక, ప్రణాళిక శాఖలను అప్పగించారు.

అలాగే ఉ‍ద్ధవ్‌ కుమారుడు, ఆదిత్య ఠాక్రేకు పర్యవరణం, టూరిజం శాఖ దక్కింది. ఎన్సీపీ సీనియర్‌ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ, నవాబ్‌ మాలిక్‌ మైనార్టీ శాఖ, జయంత్‌ పాటిల్‌కు జలవనరులు శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌కు పబ్లిక్‌ వర్స్‌ దక్కింది. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఎన్సీపీకే దక్కినట్లు తెలుస్తోంది. మిగతా వివరాలు రావాల్సి ఉంది. (శరద్‌ పవార్‌.. ప్రభుత్వంలో కీ రోల్‌)

కాగా  డిసెంబర్‌ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు.

మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు: 

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌: ఆర్థిక శాఖ, ప్రణాళికా శాఖ 
అనిల్ దేశ్‌ముఖ్‌: హోం శాఖ
ఆదిత్య ఠాక్రే : పర్యావరణం, టూరిజం శాఖ
బాలా సాహెబ్‌ తోరత్‌: రెవెన్యూ శాఖ
అశోక్ చవాన్‌ : ప్రజాపనుల శాఖ (పబ్లిక్ వర్క్స్)
ఏక్‌నాథ్ షిండే : పట్టణాభివృద్ధి శాఖ
నవాబ్ మాలిక్‌ :  మైనారిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ
ఛగన్ భుజ్‌భల్‌ :  ఆహార, పౌర, వినియోగదారుల పరిరక్షణ శాఖ
సుభాష్ దేశాయ్‌: పరిశ్రమలు, మైనింగ్, మరాఠీ భాషా మంత్రిత్వ శాఖ సంజయ్ రాథోడ్‌ : అటవీ శాఖ
ఉదయ్ సామంత్‌ : ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ, 
దాదా భుసె : వ్యవసాయం, 
సందీప్ భుమ్రే : ఉపాధి హామీ, 
గులాబ్‌రావ్ పటేల్ : వాటర్ సప్లై, 
శంకర్‌రావు గడఖ్‌ : ఇరిగేషన్ శాఖ 

కాగా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇన్ఫర్మేషన్‌ మరియు టెక్నాలజీ,  ఇన్ఫర్మేషన్‌ & పబ్లిక్‌ రిలేషన్స్‌, న్యాయశాఖ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే వద్ద ఉండగా, ఇక ఇతర మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top