‘మహా ట్విస్ట్‌’పై మీమ్స్‌.. నవ్వు ఆపుకోలేరు! | Maharashtra Government Formation Twist Triggers Memes On Social Media | Sakshi
Sakshi News home page

‘మహా ట్విస్ట్‌’పై మీమ్స్‌.. నవ్వు ఆపుకోలేరు!

Nov 23 2019 5:20 PM | Updated on Nov 23 2019 5:21 PM

Maharashtra Government Formation Twist Triggers Memes On Social Media - Sakshi

మీమ్స్.. సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. చూడగానే నవ్వు వస్తుంది.  ఓ చిన్న బొమ్మ దాని కింద రాసే అక్షరాలు.. ఎంతో అర్థాన్ని ఇస్తాయి. అంతేకాదు కామెడీ పూయిస్తాయి. చూసినోళ్లు నవ్వకుండా ఉండలేరు. ఏ అంశం మీదైనా ఈ మధ్య సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఒక్కఫోటోతో ఏం జరిగిందో కామెడీగా చెప్పేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ రోజు జరిగిన ‘మహా’  ట్విస్ట్‌పై కూడా  సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. ఇక శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ రాత్రికిరాత్రే ఎన్నో ఎన్నోమార్పులు జరిగాయి. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయానంతా నెటిజన్లు తమదైన శైలిలో చెప్పేస్తున్నారు. సీఎం అవుతాని భావించిన ఉద్దవ్‌ ఠాక్రే ఆశలు ఆవిరైపోయాయి. బీజేపీ నేతలు చీటింగ్‌ చేశారు, మోదీ, అమిత్‌ షాలు కలిసి గేమ్‌ను ఛేంజ్‌ చేశారు.. అనే అర్థాలు వచ్చే విధంగా ఉన్న మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవెంటో చూసి మీరూ నవ్వుకోండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement