‘కాంగ్రెస్‌తో దోస్తీ​.. ఎన్టీఆర్‌ ఫొటో, పేరు వాడుకోవద్దు’ | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 12:09 PM

Laxmi Parvathi Fires On Chandrababu Naidu Over TDP Congress Alliance - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు’  అని స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ‘ఎన్టీఆర్‌ భార్యగానే వచ్చాను. రాజకీయాలు చేయడానికి కాదు’ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని లక్ష్మీపార్వతి ఖండించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్టరాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు.

ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ  తలవంచకుండా ఎన్టీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు. నేడు కేవలం తన స్వార్ధం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారనీ, మహనీయుడయిన ఎన్టీఆర్‌ పేరుని కూడా ఉచ్ఛరించే అర్హత చంద్రబాబుకు లేదని లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు గానీ, ఫోటో గాని పెట్టుకొనే హక్కు టీడీపీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement