జేబుల్లోకి రావట్లేదన్న బాధతో కేసీఆర్‌ విమర్శలు | Laxman Comments On CM KCR | Sakshi
Sakshi News home page

జేబుల్లోకి రావట్లేదన్న బాధతో కేసీఆర్‌ విమర్శలు

May 20 2020 3:23 AM | Updated on May 20 2020 3:23 AM

Laxman Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోని డబ్బులు నేరుగా తన జేబులోకి రావట్లేదన్న దుగ్దతోనే సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మంగళవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కనీసం సెక్రటేరియట్‌కు రాకుండా, మంత్రులు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండకుండా, నియంతృత్వంతో వ్యవహరిస్తున్న కేసీఆర్‌ సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement