
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ 2014లో ఒంటరిగానే పోరాడిందని, ఇప్పుడు సైతం ఎన్ని అవకాశవాద కూటములనైనా ఒంటరిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో మహా ఘటియా బంధన్ (మహాకూటమి) ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్, టీడీపీల పొత్తు ప్రయత్నాలపై పరోక్షంగా వ్యాఖ్యానించారు.