
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి అధికారంలోకి వస్తే జీవోలు కూడా విజయవాడ నుంచే విడుదలవుతాయని తెలంగాణ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేందుకు న్యాయవాదులు అంబర్‌పేట్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, మహాకూటమిపై నిప్పులు చెరిగారు. హైకోర్టు విభజనను అడ్డుకుంది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన జరిగితే తన మీద ఉన్న కేసులు ఎక్కడ బయటపడతాయోనని చంద్రబాబు భయపడుతున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధఙకారంలోకి రాగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరిగేలా చూస్తామిన కేటీఆర్ హామీ ఇచ్చారు.