‘చలో అసెంబ్లీ’లో హింసకు కేసీఆర్‌ కుట్ర

komatireddy venkarateddy and sampath reddy commented over kcr - Sakshi

కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని హింసాయుతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీశ్‌రావు కుట్ర చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్‌ సంపత్‌కుమార్, కార్యదర్శి టి.రామ్మోహన్‌ రెడ్డి ఆరోపించారు. నిరసనలో ఏదైనా జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదదంటున్నారంటే.. టీఆర్‌ఎస్‌ కుట్రకు పాల్పడబోతోందని అర్థమవుతోందన్నారు.

గురువారం అసెంబ్లీ ఆవరణలో వారు మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన చేస్తామంటే మంత్రి హరీశ్‌ బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని, గూండాలను పెట్టి అల్లర్లు సృష్టించే కుట్రకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. చలో అసెంబ్లీలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఎంతమందిని అరెస్టు చేసినా కార్యక్రమం ఆగదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్‌ విప్‌ సంపత్‌కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌లో సరుకు లేదంటున్న హరీశ్‌కు కాంగ్రెస్సే రాజకీయ భిక్ష పెట్టిందని, ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌ను మంత్రి చేసిందన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని మంత్రి హరీశ్‌ను సంపత్‌కుమార్‌ హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top