ఓటు వేసిన తర్వాత కేసీఆర్‌ ఏమన్నారు? | KCR Casts Vote In His Native Village | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్రభంజనం: కేసీఆర్‌

Dec 7 2018 12:53 PM | Updated on Dec 7 2018 6:56 PM

KCR Casts Vote In His Native Village - Sakshi

ఓటు వేసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతున్న కేసీఆర్‌

అధికారం నిలబెట్టుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు.

సాక్షి, చింతమడక: అధికారం నిలబెట్టుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చింతమడకలో తన సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని, భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రభంజనం సృష్టిస్తామని దీమాగా చెప్పారు. ఈసారి పోలింగ్‌ శాతం​ కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.

‘ప్రభుత్వ అనుకూల పవనాలు చాలా బాగా వీస్తున్నాయి. మేము ముందు నుంచి చెబుతున్నట్టుగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మాకు ఎటువంటి అనుమానం లేదు మళ్లీ ప్రజా అనుకూల ప్రభుత్వమే వస్తుంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు సాయంత్రం మీరే చూస్తారు. ఈసారి పోలింగ్‌ శాతం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్‌లో భారీగా పోలింగ్‌ నమోదవుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార’ని కేసీఆర్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement