ప్రకాశ్‌ రాజ్‌పై ప్రజావ్యాజ్యం వేస్తాం | Karnataka Man Complaint To Election Commission On Prakash Raj | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌ రాజ్‌పై ప్రజావ్యాజ్యం వేస్తాం

Apr 1 2019 9:29 AM | Updated on Apr 1 2019 9:58 AM

Karnataka Man Complaint To Election Commission  On Prakash Raj - Sakshi

మాట్లాడుతున్న కే.గిరీశ్‌కుమార్‌ నాయుడు తదితరులు

శివాజీనగర : బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కర్ణాటకతో పాటు మూడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో పేరు ఉండటంతో హైకోర్టులో వ్యాజ్యం వేయనున్నట్లు శాంతినగర నివాసి కే.గిరీశ్‌ కుమార్‌ నాయుడు తెలిపారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మూడు చోట్ల ఓటర్ల జాబితా ఉన్న విషయాన్ని తెలియజేసిన ఆయన, బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శాంతినగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తమ పేరును చేర్చారు.

మిగిలిన తమిళనాడులో, తెలంగాణ రాష్ట్రంలో సేర్‌లింగమ్‌ పల్లి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తమ పేరును అలాగే ఉంచుకొన్నారని ఆరోపించారు. రాజ్యాంగ ఎన్నికల నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకేచోటకంటే అధిక విధానసభా నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు ఉంచుకోవటం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతనెల 28న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. హైకోర్టులో ఈ విషయంపై ప్రజావాజ్యం వేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement