రాజకీయాల్లోకి కన్నడ నటుడు సుదీప్‌...?

kannada actor sudeep political entry - Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి : అభినవ చక్రవర్తి, కన‍్నడ నటుడు కిచ‍్చ సుదీప్‌ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?. ఇదే చర‍్చ ఇప్పుడు కన‍్నడ నాట జోరుగా సాగుతోంది.

2018లో కర్నాటకలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే గెలుపుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సినిమా రంగంలో ఉన్న వారిని కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌ బరిలో ఉండే సూచనలు కనిపిస్తుంన్నాయి. ఈ విషయమై ఇప్పటివరకు నటుడు సుదీప్‌ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోయినా ఆయన ఇటివల సీఎం సిద్దరామయ్యను కలవడం చర‍్చనీయాంశమైంది.

వచ్చే ఎన్నికల‍్లో సుదీప్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి తప‍్పకుండా పోటీచేస్తారని కన్నడ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య ప్రకటించడం  ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. సుదిప్‌ను రాజకీయాల్లోకి తీసుకోనిరావడానికి రమ్య గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కిచ్చ సుదీప్‌తో కలిసి ఆమె రంగ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ముస్సంజే సినిమాల్లో నటించింది. అంతే కాకుండ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. కాంగ్రెస్‌ పార్టీలో చేరమని సుదీప్‌ను రమ్య అడిగిందన‍్న వార‍్తలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ సుదీప్‌ ఒప్పుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో సుదీప్‌ను చిత్రదుర్గలోని మోళ కాల్మూరు నియోజకవర్గం నుంచి బరిలో దింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సుదీప్‌ ఓకే చెబితే ప్రస్తుతం మోళు కాల్మూరు నియోజకవర్గం ఎస్‌టీలకు రిజర్వ్‌ కావడంతో నాయక సముదాయనికి చెందిన కిచ్చ సుదీప్‌ను ఇక్కడి నుంచి బరిలో దించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇటివలె కన్నడ నటుడు విష్ణువర్థన్‌ స్మారకం ఏర్పాటు చేసే విషయం పైన నటుడు సుదీప్‌ సీఎం. సిద్దరామయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు.
అక్కడ సీఎంతో కలిసి సుదీప్‌ ఏకాంతంగా చర‍్చలు జరిపారు. కాని బయటకి వచ్చిన సుదీప్‌ను మీడియా ప్రతినిదులు కాంగ్రెస్‌ పార్టిలో చేరుతున్నారా అని అడగ్గా ఈ విషయం పైన ఎలాంటి స్పందన తెలుపకుండా నవ్వుతూ  చేయి ఊపి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో సుదీప్‌ కాంగ్రెస్‌ పార్టీలొ చేరుతున్నారా లేదా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top