ఆయనెవరో తెలుసా? | Kanna Laxmi Narayana Post A Satirical Question In Twitter | Sakshi
Sakshi News home page

ఆయనెవరో తెలుసా?

Mar 13 2019 5:03 PM | Updated on Mar 14 2019 4:20 PM

Kanna Laxmi Narayana Post A Satirical Question In Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్‌ వేదికగా ఆసక్తికరమైన చర్చకు తెరతీశారు. ఎన్నికల వేళ రాజకీయ వేడి పెంచేలా ట్విటర్‌లో ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకు నిజాలు చెప్పం.. అయినా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం.. ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా??’ అంటూ కన్నా  ఓ ప్రశ్నను నెటిజన్ల ముందుంచారు. అందుకు హింట్‌ అంటూ.. ‘వెన్నుపోటుకి వారసుడు.. యూ టర్న్‌కు దగ్గరి చుట్టం’ అని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓ ఊసరవెల్లి ఫోటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. కన్నా చేసిన కామెంట్లు ఓ రాజకీయ పార్టీని ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తుంది. కన్నా చేసిన ట్విట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement