అభిమానిపై మళ్లీ చేయిచేసుకున్న బాలకృష్ణ | hindupuram mla actor balakrishna slaps his fan  | Sakshi
Sakshi News home page

అభిమానిపై మళ్లీ చేయిచేసుకున్న బాలకృష్ణ

Oct 3 2017 1:31 PM | Updated on Aug 29 2018 1:59 PM

 hindupuram mla actor balakrishna slaps his fan  - Sakshi

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు.

సాక్షి, హిందూపురం: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో మంగళవారం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో నియోజక వర్గ సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు.

అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై ఆగ్రహంతో ఊగిపోయి అతని చెంప చెళ్లుమనిపించారు. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ఱ అభిమానులపై చేయిచేసుకున్న విషయం విదితమే.

చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ

అసిస్టెంట్ ను కొట్టిన బాలయ్య


 

Advertisement
 
Advertisement
Advertisement