అసిస్టెంట్ను కొట్టిన బాలయ్య | Balakrishna Beats his Assistant | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ను కొట్టిన బాలయ్య

Aug 3 2017 2:07 PM | Updated on Aug 29 2018 1:59 PM

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య తన 102వ సినిమాగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement