చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ | nandamuri balakrishna attacked on TDP worker | Sakshi
Sakshi News home page

చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ

Aug 17 2017 9:31 AM | Updated on Aug 29 2018 1:59 PM

టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన 'చేతివాటం' ప్రదర్శించారు.

నంద్యాల: టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన 'చేతివాటం' ప్రదర్శించారు. ఇటీవల తన అసిస్టెంట్‌ను కొట్టి పతాక శీర్షికలకు ఎక్కిన ఆయన తాజాగా మరొకరిపై చేయి చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త అయిన తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. బుధవారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఆశపడిన ఓ టీడీపీ కార్యకర్త ఉత్సాహంగా ఆయన వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్తపై దాడి చేశారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు దాడి చేసిన తీరు చూసి అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పెట్టారు. విషయం బయటకు రావడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న సమయంలో బాలకృష్ణ దురుసు ప్రవర్తనతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో అధికార పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. బాలకృష్ణ ఇలా పార్టీ కార్యకర్తలు, అభిమానులపై చేయిచేసుకున్న సంఘటనలు గతంలోనూ ఉన్నాయి.

అసిస్టెంట్ను కొట్టిన బాలయ్య

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement