సత్తెనపల్లిలో టీడీపీకి షాక్‌! | Guntur TDP Leaders Joins YSRCP | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లిలో టీడీపీకి షాక్‌!

Jan 11 2020 1:15 PM | Updated on Jan 11 2020 1:23 PM

Guntur TDP Leaders Joins YSRCP - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఇదిలా ఉండగా... అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు గుంటూరు జిల్లాలో చిన్న కాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన పలువురు నేతలు పార్టీ మారడంతో టీడీపీ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

Advertisement
 
Advertisement
Advertisement