‘చంద్రబాబుది.. నీరు చెట్టు దోపిడీ చరిత్ర’ | Gummanuru Jayaram Slams On Chandrababu In Kurnool | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుది.. నీరు చెట్టు దోపిడీ చరిత్ర’

Dec 4 2019 3:25 PM | Updated on Dec 4 2019 3:26 PM

Gummanuru Jayaram Slams On Chandrababu In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: చంద్రబాబుకు మతిస్థిమితం లేకుండా పోయిందని.. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం, మట్కా దందా నడిపించిందే చంద్రబాబు అని దుయ్యబట్టారు. నీరు చెట్టుతో డబ్బులు దోపిడీ చేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జయరాం ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement