తేలనున్న కర్ణాటకం : బలపరీక్ష ఈరోజే చేపట్టాలన్న గవర్నర్‌

Governor Tells Speaker To Consider Trust Vote By The End Of The Day - Sakshi

బెంగళూర్‌ : కన్నడ రాజకీయాలు క్షణానికో మలుపుతిరుగుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తడంతో నెలకొన్న సందిగ్ధం గవర్నర్‌ సూచనలతో మరో ఉత్కంఠకు తెరలేపింది. బలపరీక్షను ఈరోజే పూర్తిచేయాలని కర్ణాటక స్పీకర్‌ ఆర్‌ రమేష్‌ కుమార్‌కు రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా సూచించారు. గవర్నర్‌ సందేశం స్పీకర్‌ సభలో చదివి వినిపించారు.

కాగా అంతకుముందు విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కాలయాపన చేస్తున్నాయని బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి  ఫిర్యాదు చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు హాజరు కాకపోయినా ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తప్పవని సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నంగా తమ పార్టీ రెబెల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేస్తూ హెచ్చరించారు.

మరోవైపు విప్‌ విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చేంత వరకూ విశ్వాస పరీక్ష చేపట్టవద్దని సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top