ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ

Finance Minister Arun Jaitley said today that NDA has been a huge success - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అద్భుత విజయం సాధించిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం వ్యాఖ్యానించారు. వారసత్వపాలన, రాచరిక పాలన, కులాల ఆధారిత రాజకీయాలను ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించారని  అన్నారు. పూర్తి మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపడుతుందని ఆయన చెప్పారు. అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైనట్టుగానే ఫలితాలు సాధించామని  తెలిపారు. ‘అద్భుత విజయాన్ని అందించిన సందర్భంగా ప్రధాని మోదీకి, ఎన్డీ యే, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నాను’అని ఆయన చెప్పారు. ఈవీఎంలను అనుమానించడం, వీవీ పాట్ల లెక్కింపునకు డిమాండ్‌  ద్వారా ప్రజాస్వామ్యాన్ని చులకన చేసేందుకు యత్నించిన విపక్షాలను  దుయ్యబట్టారు.   విజయానికి తోడ్పాటునందించినందుకు  ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top