ఎగ్జిట్‌ ఫలితాలు చూసి ఆందోళన వద్దు | dont worry exit polls | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ ఫలితాలు చూసి ఆందోళన వద్దు

May 23 2019 5:26 AM | Updated on May 23 2019 5:26 AM

dont worry exit polls - Sakshi

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ‘రాబోయే 24 గంటలు మనకు చాలా కీలకం. అప్రమత్తంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. మనం సత్యం కోసం పోరాడుతున్నాం. తప్పుడు ఎగ్జిట్‌ ఫలితాలను చూసి నిరాశచెందకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టం ఎప్పటికీ వృథా కాదు’ అని బుధవారం ట్వీట్‌ చేశారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు, వదంతులను చూసి నిరాశచెందవద్దని ఇటీవల ప్రియాంక గాంధీ కూడా పార్టీ కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement