‘సింహాలు కాదు నక్కలు’ | Dasoju sravan commented over trs | Sakshi
Sakshi News home page

‘సింహాలు కాదు నక్కలు’

Oct 2 2018 2:41 AM | Updated on Oct 2 2018 2:41 AM

Dasoju sravan commented over trs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేతలు సింహాలు కారని.. నక్కలు, గాదె కింది పందికొక్కులని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కారుకూతల రామారావు చిల్లరమాటలు మానుకోవాలని హితవు పలికారు.  టీఆర్‌ఎస్‌ అంటే ట్రైటర్స్‌ (మోసగాళ్ల) రాష్ట్ర సమితి అని, తెలంగాణకు పట్టిన తెగులు టీఆర్‌ఎస్‌ అని అన్నారు. కారు అంటే కారుకూతలని, చేయి అంటే చేతలని ఆరోపించారు.

ఈ ఎన్నికలు స్వార్థానికి, స్వాభిమానానికి.. అధికారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలు కోటగోడల మధ్య తెలంగాణ ప్రజల రక్తమాంసాలు రుచిమరిగిన ముసలి సింహం కేసీఆర్‌కు, దేశ రక్షణ కోసం కంకణబద్ధులైన కాంగ్రెస్‌ సైనికులకు మధ్య జరుగుతున్నాయని శ్రవణ్‌ అన్నారు.  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని జోస్యం చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement