వైఎస్సార్‌సీపీ లో చేరిన టీడీపీ, జనసేన యువకులు | Dadi Veerabhadra Rao Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ధన ‘దేశం’గా మార్చిన చంద్రబాబు

Apr 1 2019 1:31 PM | Updated on Apr 1 2019 1:31 PM

Dadi Veerabhadra Rao Slams Chandrababu Naidu - Sakshi

దాడి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్న తుమ్మపాల యువకులు

విశాఖపట్నం, అనకాపల్లి టౌన్‌: పేదల కోసం ఆవిర్భవించిన టీడీపీని నేడు చంద్రబాబు ధనిక పార్టీగా మార్చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. ఆదివారం గవరపాలెంలోని ఆయన స్వగృహంలో తుమ్మపాలకు చెందిన 30 మంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి దాడి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పదిరోజులు పార్టీకి కీలకమైన రోజులని, ఈ కాలంలో పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేయాలని కోరారు. మండల ఉపాధ్యక్షుడు కాండ్రేగుల రవి, జగదీష్, మధు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీదేవిపేటలో...
లక్ష్మీదేవిపేటలో న్యాయవాదులందరూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ సమక్షంలో పార్టీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి  ఆహ్వానించారు. రేబాక రామారావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, జాజుల రమేష్‌ అధికసంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దాడి క్యాంపు కార్యాలయంలో...
పట్టణ, మండలంలో పలు ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 300 మంది వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థిని భీశెట్టి వెంకట సత్యవతి, పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌ల సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ రత్నాకర్, సత్యవతిలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ గెలుపుకు కష్టించి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి ఆనంద్, పవన్, మహేష్, నాగు, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement