ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది

సాక్షి, సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం 14రోజులైనా బడ్జెట్ సమావేశాలు జరపకపోవటం మంచిదికాదన్నారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా సమావేశం మధ్యలోనే ముగించారని మండిపడ్డారు. నల్లమలలో యురేనియం తవ్వకాల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ఒక పెద్ద స్కాం లబ్ధిదారులకు పూర్తిన్యాయం జరగలేదన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి