సిద్ధిపేట: ఓ వ్యక్తిని హత్య చేసేందుకు బేరం కుదుర్చుకున్న సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటలో ఎల్లారెడ్డి అనే వ్యక్తిని హత్య చేసేందుకు పలువురు రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
దీనిలో భాగంగా కారుతో గుద్ది యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు పరారయ్యారు.


