నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్‌

Congress suspends TPCC official spoke person Nagesh Mudiraj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్‌ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో క్రమశిక్షణా సంఘం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై చైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన  క్రమశిక్షణా సంఘం సమావేశం సోమవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో కో చైర్మన్‌ అనంతుల శ్యామ్‌ మోహన్‌, కన్వీనర్‌ కమలాకర్‌ రావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వీహెచ్‌, నగేశ్‌ మధ్య జరిగిన ఘర్షణపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. నగేశ్‌ ముదిరాజ్‌ ఈ సందర్భంగా  క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై సంఘటనపై వివరణ ఇచ్చారు. మరోవైపు వీహెచ్‌ కూడా జరిగిన సంఘటనపై లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. అలాగే పార్టీ నాయకులు అందించిన సమాచారాన్ని కూడా పరిశీలించింది. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత నగేశ్‌ ముదిరాజన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
నగేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్

చదవండి: (వేదికపైనే కొట్టుకున్న వీహెచ్‌, నగేశ్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top