ట్రిపుల్‌ తలాక్‌​ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా | Congress Rajya Sabha MP Sanjay Singh Resigns From Party | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ తలాక్‌​ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

Jul 30 2019 2:51 PM | Updated on Jul 30 2019 2:55 PM

Congress Rajya Sabha MP Sanjay Singh Resigns From Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అమిత్‌ షా సమక్షంలో రేపు బీజేపీ చేరబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన సంజయ్‌ దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాజీనామాతో పార్టీ నేతలు షాక్‌కిగురయ్యారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement