డాక్టర్‌ సుధాకర్‌ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్‌ | Chandrababu Naidu is a Dalit traitor, says MP Nandigam Suresh | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సుధాకర్‌ టీడీపీ మనిషి: ఎంపీ సురేష్‌

May 17 2020 5:26 PM | Updated on May 17 2020 5:38 PM

Chandrababu Naidu is a Dalit traitor, says MP Nandigam Suresh - Sakshi

సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దళితుల్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి 151 సీట్లు ఇచ్చినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదని అన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, మోసం చేయటం ఆయన పేటెంట్ హక్కు అని మండిపడ్డారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌ బాబు టీడీపీకి చెందిన వ్యక్తి అని ఆయన అన్నారు.  గతంలో సుధాకర్‌ బాబు టీడీపీ సీటును ఆశించిన వ్యక్తి అని అన్నారు. (అనస్థీషియా వైద్యుడి వీరంగం)

ఎంపీ నందిగం సురేష్‌ ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘దళితుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కుల రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. దళితులకు విలువ లేకుండా చేయాలన్నదే ఆయన ఆలోచన. వారిని నాశనం చేసింది కూడా చంద్రబాబే. డాక్టర్‌ సుధాకర్‌ బాబు 2019లోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. (చంద్రబాబు డైరెక్షన్‌‌లో.. డాక్టర్‌ సుధాకర్‌)

వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం దళితుడిని బలి చేస్తున్నారు. సుధాకర్ బాబుని బట్టలు లేకుండా రోడ్డుపైన పడేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో  ప్రభుత్వం దళితులకు ఇళ్లస్థలాలు ఇస్తానంటే కోర్టుకెళ్లి దాన్ని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. దళితులకు ప్రయోజనం కలిగించే ఇంగ్లీష్ మీడియం కూడా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు ముందు దళితుల అందరికీ క్షమాపణ చెప్పాలి. పేదల పొట్ట కొట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు. సుధాకర్ బాబు ఎప్పటికైనా తనను చంద్రబాబు ఎలా వాడుకుంటున్నారు ఆలోచించాలి’ అని హితవు పలికారు. (బాబు చేతిలో డాక్టర్ కీలు బొమ్మ’)

Advertisement
 
Advertisement
Advertisement