‘ఆయన అక్కడ అడుగుపెడితే చంపేస్తాం’

BJP MLAs Son Threatens To Shoot Jyotiraditya Scindia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాం‍గ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాను హతమారుస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖతీక్‌ కుమారుడు ప్రిన్స్‌దీప్‌ లాల్‌చంద్‌ ఖతీక్‌ హెచ్చరించడం కలకలం రేపింది. ‘జ్యోతిరాదిత్య సింధియా..నీలో ఝాన్సీ రాణిని చంపిన జివాజిరావు రక్తం ప్రవహిస్తోంది. నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను కాల్చిచంపుతా..నా చేతిలో నీ చావు తప్పద’ని లాల్‌చంద్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 5న హట్టా జిల్లాలో ర్యాలీకి సింధియా హాజరవుతున్న నేపథ్యంలో లాల్‌చంద్‌ పోస్ట్‌ దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని హట్టా నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ‘సింధియా గౌరవ ఎంపీ..ఆయనపై ఇలాంటి పోస్ట్‌ దురదృష్టకరం..ఈ పోస్ట్‌ను తొలగించమని నా కుమారుడిని కోరతా’నని ఉమాదేవి పేర్కొన్నారు.

జ్యోతిరాదిత్య సింధియాకు దేశవ్యాప్తంగా ఉన్న పేరుప్రతిష్టలకు భయపడి బీజేపీ ఆయనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రాజా పటేరియా విమర్శించారు. ఈ ఉదంతంపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి సింధియాకు భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top