‘తప్పుడు ప్రచారాలు పటాపంచలు’ | BJP leader bandi sanjay comments on karnataka election result | Sakshi
Sakshi News home page

‘తప్పుడు ప్రచారాలు పటాపంచలు’

May 15 2018 11:27 AM | Updated on May 15 2018 11:40 AM

BJP leader bandi sanjay comments on karnataka election result - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా పన్నిన కుట్రలు, తప్పుడు ప్రచారాలు పటాపంచలయ్యాయన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతం పేరుతో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రయత్నాలకు కర్ణాటక గెలుపు కనువిప్పులాంటిదని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement