ఒవైసీపై బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

Bandi Sanjay Fires On MP Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.  మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం ఒవైసీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఒవైసీకి కనీసం తెలీదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి హితవుపలికారు. దేశ ఐక్యతకు మోదీ ఈ కార్యక్రమం పిలుపునిచ్చారని సంజయ్‌ గుర్తుచేశారు. ఆదివారం రాత్రి దారుసలేం వెళ్లి చూస్తూ ప్రజల స్పందన కనువిందు చేస్తుందని అన్నారు. (మా జీవితాలను తగ్గించొద్దు..)

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా డాక్టర్లపై పలువురు ద్రోహులు భౌతిక దాడులకు దిగినా వైద్యులు సహనంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు.‘కరోనా బారిన పడి వేలమంది బాధపడుతుంటే ఒవైసీ హాస్పిటల్‌ను ఐసోలాషన్ వార్డుకు ఇచ్చి వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని ఒవైసీ. ఆయనకు దమ్ముంటే డాక్టర్లపై, నర్సులు, పోలీసులు, ఆశావర్కర్లలపై దాడులను ఆపాలి. పేదప్రజలకు ఇబ్బంది పడకూడదని.. కేంద్ర ప్రభుత్వం బియ్యం, పెన్షన్, గ్యాస్, జనాధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. వైద్యులకు మనోధైర్యం అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలి. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 దీపాలు వెలిగించాలి’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top