‘జేసీ సోదరులకు భయం పట్టుకుంది’ | Anantapur YSRCP Leaders Slams JC Brothers | Sakshi
Sakshi News home page

‘జేసీ సోదరులకు భయం పట్టుకుంది’

Nov 20 2017 3:19 PM | Updated on Jun 1 2018 8:45 PM

Anantapur YSRCP Leaders Slams JC Brothers - Sakshi - Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్‌ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైఎస్సార్‌ సీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

వైఎస్సార్‌ సీపీ నేత ఉదయ్‌భాస్కర్‌ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు పడతాయని జేసీ సోదరులకు భయం పట్టుకుందని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే చంద్రబాబు విధానమా అని ప్రశ్నించారు. జేసీ సోదరులు పద్ధతి మార్చుకోకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అప్పేచర్ల గ్రామంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement