చంద్రబాబుది నీచమైన ఎత్తుగడ: అంబటి రాబాబు

Ambati Rambabu Lashes Out At Chandrabu Politics About Kodela Suicide Issue - Sakshi

కోడెల మృతికి కుటుంబం, టీడీపీనే కారణం: అంబటి

కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి

ప్రజలకు వాస్తవాలు తెలియాలి

సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్‌ నేత మరణిస్తే టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కోడెల శివప్రసాదరావు మృతి వెనక మిస్టరీ ఉంది. ఆయన మృతికి కుటుంబసభ్యులు, టీడీపీనే కారణం. కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నేతలే. మేం కాదు. పల్నాటి పులి అనే వ్యక్తి ఎందుకు ఉరేసుకున్నాడు?. చంద‍్రబాబు తీరువల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. 

కోడెల రాజకీయ వారసుల్ని ప్రకటించాలి
కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకొచ్చాయి. గతంలో ఆయన ఆస్పత్రిలో ఉంటే చంద్రబాబు ఒక్కసారి కూడా పరామర్శించలేదు. అంతేకాదు.. కోడెలపై సొంత పార్టీ నేత వర్ల రామయ్యతో ఆరోపణలు చేయించారు. సత్తెనపల్లిలో కోడెలను అవమానించింది చంద్రబాబే. ఎన్నిసార్లు ప్రయత్నించినా కోడెలకు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. త‍్వరలోనే కోడెలను సస్పెండ్‌ చేయబోతున్నామని.. చంద్రబాబు ప్రచారం చేయించారు. బాబుకు ప్రేమ ఉంటే కోడెల రాజకీయ వారసులను ప్రకటించాలి. సత్తెనపల్లి నుంచి కూతుర్ని, నర‍్సరావుపేట నుంచి కొడుకుని రాజకీయ వారసులుగా ప్రకటించండి.

కోడెల అంత పిరికివారు కాదు..
కోడెల మరణాన్ని వైఎస్సార్‌​ సీపీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. రాజకీయ ప్రత్యర్థి చనిపోవాలని ఎవరు అనుకోరు. పెద్ద పెద్ద కేసులను ఎదుర్కొన్న వ్యక్తి ఆయన. ఎన్నో సంక్షోభాలను కోడెల చూశారు. గతంలో సీబీఐ విచారణ జరిగినా భయపడలేదు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. కోడెల ఎందుకు ఉరి వేసుకున్నాడో ప్రజల్లో చర్చ జరగాలి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. కోడెల మరణానికి కారణం మొదటిది ఆయన కుటుంబ సభ్యులు, రెండోది తెలుగుదేశం పార్టీనే. కోడెలకు టీడీపీ వాళ్లు ఒక్కరైనా అండగా నిలిచారా?.  

కోడెలను ఎందుకు పరామర‍్శించలేదు
గతంలో ఆయన ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పుడు గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. కోడెల ఆత్మహత్యాయత్నం చేస్తే నాలుగుసార్లు గుంటూరు వచ్చిన చంద్రబాబు కనీసం కోడెలను పరామర్శించలేదు. సత్తెనపల్లిలో ఆయనను దారుణంగా అవమానించారు. చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. కోడెల పార్థివ దేహం పక్కన పెట్టుకుని వైఎస్సార్‌ సీపీపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మారింది. ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబు కాదా?. హరికృష్ణ మానసిక క్షోభకు ఆయన కారణం కాదా?. గతంలో ఎమ్మెల్యే రోజా మీద, మా మీద ఎన్నో కేసులు చంద్రబాబు పెట్టారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రన్‌వే మీదే అడ్డుకున్నారు. కోడెల మరణంపై విచారణ జరిగినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.’ అని ఎమ్మెల్యే అంబటి స్పష్టం చేశారు. 

చదవండి:

కోడెల ఫోన్ నుంచి టైమ్లో చివరి కాల్..

కోడెల కాల్డేటాపై విచారణ జరపాలి

అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు

ఆది నుంచి వివాదాలే!

కోడెల మృతిపై బాబు రాజకీయం!

కోడెల మృతితో షాక్కు గురయ్యాను...

కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!

కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top