కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి రాంబాబు

Many Doubts on Kodela Death, Says YSRCP MLA Ambati Rambabu  - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. కోడెల మృతిపై అనేక సందేహాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోడెల మృతిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. పోలీసుల విచారణలో వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 

స్పీకర్‌ తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతి పట్ల స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంతాపం వ్యక్తం చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top